సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (14:59 IST)

విజయ్ దేవరకొండతో "అర్జున్ రెడ్డి" హీరోయిన్‌లా చేస్తా : మెహ్రీన్

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. కుర్రకారుకలల రాణిగా చెరగని ముద్రవేసుకుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'కేరాఫ్ సూర్య' సినిమ

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. కుర్రకారుకలల రాణిగా చెరగని ముద్రవేసుకుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'కేరాఫ్ సూర్య' సినిమాలలో అలరించిన మెహ్రీన్, వచ్చేనెల 1వ తేదీన 'జవాన్'తో ప్రేక్షకులను పలకరించనుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మెహ్రీన్ స్పందిస్తూ, అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ నటన సూబర్బ్‌గా ఉందన్నారు. ఈ చిత్రంలో యూత్‌కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఉన్నాయన్నారు. అందుకే ఈ చిత్రం తనకు బాగా నచ్చిందన్నారు. 
 
ముఖ్యంగా, యువతకి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే విజయ్ దేవరకొండతో చేయాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఆ చిత్రంలో హీరోయిన్ తరహాలో నటించేందుకు సిద్ధం" అని చెప్పుకొచ్చింది.
 
కాగా, ఇటీవలి కాలంలో మెహ్రీన్ నటించిన చిత్రాలన్నీ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ కారణంగా మెహ్రీన్‌ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ యమబిజీగా గడుపుతున్నారు.