గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (17:13 IST)

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Jayaprada's brother Rajababu's son Samrat at Rajahmundry Pushkar Ghat
Jayaprada's brother Rajababu's son Samrat at Rajahmundry Pushkar Ghat
ఇటీవలే మరణించిన సినీనటి జయప్రధ సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం నేడు జరిగింది. నేడు జయప్రద రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ,  రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రి కి ఎప్పుడొచ్చినా  రాజబాబు తోడుగా వచ్చేవాడు. ఫిబ్రవరి 27న ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. 
 
వారి కుమారుడు సామ్రాట్ ని తీసుకువచ్చి ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే అస్తికులు కలపడం జరిగిందని జయప్రద చెప్పారు.
 
ఈరోజు ఏడో రోజు రాజమండ్రి ప్రజలు ఈ గోదారమ్మ తల్లి మోక్షాన్ని ప్రసాదించాలని ఆ శివుడు  మా తమ్ముడికి మోక్షం కలిగించాలని, మా తమ్ముడు కుమారుడు సామ్రాట్ తో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఆమె తెలిపారు.