ఆడియన్స్ థియేటర్స్ కి రారనే భయం లేదు : నిర్మాత దిల్ రాజు
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7 శుక్రవారం రీరిలీజ్ చేస్తున్నాం. అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి' అన్నారు నిర్మాత దిల్ రాజు.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, సంక్రాంతి వస్తున్నాం తర్వాత ప్రేక్షకులని కలవడం ఆనందంగా వుంది. మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ వున్నా సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్రెడీ ఓటీటీ లో వుంది. జనం చుసేశారు. అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు.
మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని మళ్ళీఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి. ఆంద్రలో డే వన్ అరవై డెబ్బై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వున్నాయి. ఫ్రైడేకి అవి ఫుల్స్ అయిపోతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ హ్యాపీనెస్ ఈ సినిమా ద్వారా కనిపిస్తోంది. నేనూ వెళ్లి మార్చి 7న సుదర్శన్ 35ఎంఎం లో మార్నింగ్ ఎనిమిది గంట షో చూస్తాను. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.. థాంక్ యూ'అన్నారు