ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (12:27 IST)

దసరాకు సందడి చేయనున్న 'అరవింద సమేత వీరరాఘవ'

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా, ఈ చిత్రం అక్టోబరు 11వ తేదీన

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా, ఈ చిత్రం అక్టోబరు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా కథానాయికలుగా నటిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 'అరవింద సమేత' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది.
 
అలాగే, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజైన అరవింద సమేత సినిమా టీజర్ ప్రేక్షకుల,అభిమానులలో కేక పుట్టించింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో టీజర్ కనుల పండుగ చేసింది. ఎన్టీఆర్ రాయలసీమ స్లాంగ్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో వినసొంపుగా ఉన్నాయి. 
 
హీరో ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌ను హైలెట్ చేశాయి. 'కంట బడ్డావో కనికరిస్తా యంట బడ్డానా నరికేస్తా ఓబా' అంటూ కుర్చీని పల్టీ కొట్టించి స్టైల్‌గా కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ టీజర్‌తో 'అరవింద్ సమేత' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.