బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (17:44 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో వుండే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
 
హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ ఎన్టీఆర్‌కు విలువైన కారును కానుకగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఎన్టీఆర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 
 
సినిమాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసే ఎన్టీఆర్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తరహాలోనే... తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ట్విట్టర్‌లో తారక్‌కి రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే 15,000 మంది ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. ఇందులో ఆయన తన మొట్టమొదటి పోస్ట్‌గా తన కొత్త సినిమా 'అరవింద సమేత.. వీర రాఘవ' పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.