ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (11:57 IST)

హీరోయిన్లను అక్కా చెల్లెళ్లుగా భావించండి.. అంగాంగ ప్రదర్శన వద్దు : జ్యోతిక కామెంట్స్

జ్యోతిక.. ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్రనటి. ఇపుడు తమిళ హీరో సూర్య సతీమణి. ఇద్దరు పిల్లలకు తల్లి. అపుడపుడు ఆటవిడుపుగా ఒకటి అర చిత్రాల్లో నటిస్తోంది. ఈమె తాజాగా హీరోయిన్లు, వారి

జ్యోతిక.. ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్రనటి. ఇపుడు తమిళ హీరో సూర్య సతీమణి. ఇద్దరు పిల్లలకు తల్లి. అపుడపుడు ఆటవిడుపుగా ఒకటి అర చిత్రాల్లో నటిస్తోంది. ఈమె తాజాగా హీరోయిన్లు, వారి పాత్రలపై హాట్ కామెంట్స్ చేశారు. ‘సినిమా కథల్లో హీరోయిన్ పాత్రలను రాసేటప్పుడు దయచేసి మీ ఇంట్లో అమ్మ, భార్య, అక్కాచెల్లెళ్లను గుర్తు చేసుకోండి. తెరపై హీరోయిన్లను గౌరవప్రదంగా చూపండి’ అంటూ ఆమె సినీ దర్శకులకు విజ్ఞప్తి చేశారు.
 
చెన్నైలో జరిగిన ఓ ఆడియా కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి మాట్లాడుతూ పెద్ద హీరోలతో సినిమాలు తీసే దర్శకులందరికీ నాదొక విజ్ఞప్తి. దయచేసి మీ కథల్లో హీరోయిన్లను గౌరవప్రదంగా చూపించండి. మీ నిజజీవితంలో ప్రముఖ పాత్ర వహించే మీ తల్లి లేదా భార్య లేదా ప్రియురాలిని గుర్తుచేసుకొని పాత్రలు రాయండి. ఎలాగూ మీరు హీరోయిన్లకు మంచి కాస్ట్యూమ్స్‌ ఇవ్వరు. కనీసం అర్థవంతమైన, సున్నితమైన పాత్రలనైనా సృష్టించండి. హీరోయిన్లు కమెడియన్ల పక్కన నిల్చొని డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చెప్పడం, సిగ్గులేకుండా హీరోల వెనుక పడటం వంటి సన్నివేశాలు చూడ్డానికి ఏమాత్రం బాగోలేదన్నారు. 
 
ముఖ్యంగా, హీరోలకు భారీగా అభిమానులుంటారు. వారు చెప్పే డైలాగులు, మేనరిజంలు సాధారణ ప్రజలపై ముఖ్యంగా యువతపై చాలా ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు ఒక సినిమాలో ఒక హీరోకి నలుగురు హీరోయిన్లు ఉంటే... వారి అభిమానులు కూడా అలాగే ఆలోచించి ముగ్గురు, నలుగురు గర్ల్‌ ఫ్రెండ్స్‌ కావాలనుకోరా? ఒక హీరోకి ఒక హీరోయిన్ చాలు. రెండో హీరోయిన్ అవసరం లేదు. ఇది దర్శకులందరికీ నా విజ్ఞప్తి. మంచి సినిమాలు నిర్మిద్దాం. మన దేశంలోని స్త్రీల కోసం సామాజిక బాధ్యతతో వ్యవహరిద్దాం’ అంటూ జ్యోతిక చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.