శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (15:44 IST)

కళాతపస్వి రాజేష్ కన్నుమూత..

Rajesh
ప్రముఖ కన్నడ నటుడు కళాతపస్వి రాజేష్ (89) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో వారం రోజుల కిందట ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన మృతి పట్ల  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 
 
రాజేష్ 150 చిత్రాల పైచిలుకు సినిమాల్లో నటించాడు. కొన్ని టీవీ షోలలో కూడా చేశారు. 'వీరసంకల్ప్' చిత్రంతో తెరగ్రేటం చేశారు. 1968లో వచ్చిన నమ్మ ఊరు చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో.. అతని పేరు, రాజేష్‌గా మారింది. శ్రీ రామాంజేనేయ యుద్ధం, గంగ గౌరి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. 
 
2014లో వచ్చిన ఆయన ఆత్మకథ "కళా తపస్వి రాజేష్ ఆత్మకథ" కన్నడ చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చింది. ఈయనకు ఐదుగురు పిల్లలు. వీరిలో కుమార్తె ఆశా రాణి కూడా నటి. ఈమె నటుడు అర్జున్ సర్జాను వివాహం చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం రాజేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.