శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (14:29 IST)

తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్‌కుమార్ శాశ్వతనిద్ర

కన్నడ సూపర్ స్టార్ పనీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య వీటిని పూర్తిచేశారు. 
 
తెల్లవారుజామున 5 గంటల సమయంలో పునీత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. కంఠీరవ స్టేడియం నుంచి కఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ నడుమ అంతిమయాత్ర నిర్వహించారు.
 
కుటుంబ సభ్యులు, యశ్, సుదీప్ తదితర సినీ నటులు, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్దరామయ్య తదితర రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. తాను ఎత్తుకుని ఆడించిన తన సోదరుడు పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శివరాజ్ కుమార్ రోదించారు. పునీత్ భార్య అశ్విన్, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.