Biodata Maker

కల్కి సెన్సార్ పూర్తి... ఇంత‌కీ రిపోర్ట్ ఏం చెబుతోంది..?

Written By శ్రీ
Updated: గురువారం, 27 జూన్ 2019 (22:08 IST)
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడో ఎంక్వయిరీ మొదలుపెట్టారు... 'కల్కి' విడుదల ఎప్పుడు? అని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంతలా ఆసక్తి కలిగించాయి. రాజశేఖర్ కథానాయకుడిగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి'. శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ టాకీస్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో 'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే' డైలాగ్‌ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 'కల్కి' పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. 'గరుడవేగ' తర్వాత 'కల్కి'తో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అన్నీ చూడండి

సెప్టెంబర్ 11, 2026: ఏపీ, తెలంగాణల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

చెంబూరులో అలాంటి స్థితిలో 20 పిల్లులు మృతి.. సమాచారం ఇస్తే రూ.50వేలు కానుక

ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో

స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

అన్నీ చూడండి

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్

గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments