శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (09:45 IST)

ఇవ్వాళ నేను లేచి నడిచా... 'ట్విట్టర్'లో కమల్‌హాసన్‌

ఇటీవల ఇంట్లో కాలుజారి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో కమల్ హాసన్ తన అభిమానులకు ఓ మంచి శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తాను నడవగలుగుతున్నానంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల ఇంట్లో కాలుజారి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో కమల్ హాసన్ తన అభిమానులకు ఓ మంచి శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తాను నడవగలుగుతున్నానంటూ ట్వీట్ చేశారు. 
 
ఇటీవల ఆయన కాలుజారి గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పగా, చిన్నపాటి సర్జరీ చేశారు. రెండు రోజుల క్రితం నొప్పి అధికమవడంతో మళ్లీ మరోమారు చికిత్స చేశారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఆయన లేచి మెల్లమెల్లగా నడుస్తున్నారు. ఈ విషయమై కమల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అభిమానులకు, స్నేహితులకు ఓ మంచి విషయం చెప్పదలచుకున్నా. ప్రస్తుతం లేచి నడుస్తున్నానంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
గాంధీజీ మాదిరిగా ఇద్దరి సహాయంతో నడుస్తున్నప్పటికీ గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. మరోవైపు కమల్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు.