శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:22 IST)

కమల్ ముసలే తెరకెక్కించిన మదర్ థెరిసా & మీ

Kamal Musale,  Jacqueline Fitshi-Kornaj, Deepti Navel
Kamal Musale, Jacqueline Fitshi-Kornaj, Deepti Navel
"మదర్ థెరిసా & మీ" అనే శక్తిమంతమైన ఈ కథ, ఆశ, కరుణ, ప్రేమలతో సమ్మిళితమైన ముగ్గురు అసాధారణ మహిళల జీవితం. 'మదర్ థెరిసా & మీ' సినిమా నుంచి మేకర్స్ ఫిస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రం పోస్టర్‌ను విడుదలైన అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారి, సినిమా ప్రేమికులు ఈ పోస్టర్ విపరీతంగా ఆకర్షిస్తుంది.
 
ముఖ్యంగా ఈ చిత్రం భారత దేశంలో పేదలు, రోగులు అలాగే అనారోగ్యంతో మరణానికి దగ్గర అయిన వారికి మదర్ థెరిసా 1940 మధ్యకాలంలో అందించిన సేవల నేపథ్యంలో తెరకెక్కించబడింది. ఆ సమయంలో మదర్ థెరిసా ఏ విధంగా సాయపడింది. ఆ సమయంలో మదర్ థెరిసా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది. వీటితో పాటు మదర్ తెరిసా గురించి కొన్ని ప్రధాన ప్రశ్నలను, అలాగే భారత సంతతికి తెలిసిన బ్రిటిష్ మహిళ కవిత కథను కూడ ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఈ చిత్రం మొదట ఇంగ్లీష్, హిందీలో విడుదలై తరువాత స్పానిష్ లో డబ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. "కర్రీ వెస్ట్రన్" మరియు "మిలియన్స్ కెన్ వాక్" వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన డైరెక్టర్ కమల్ ముసలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
ఈ సినిమాలో ముఖ్య తారాగణం బనితా సంధు. ఈమె పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్ నటి, తన 11 సంవత్సరాల వయస్సులోనే నటించడం ప్రారంభించింది. 2018 అక్టోబర్ లో షూజిత్ సిర్కార్ ఆనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత బనితా సంధు విశ్వవిద్యాలయంలో తన డిగ్రీని పూర్తి చేసింది. ఇక తన పాత్ర 'కవిత' గురించి బనితా సంధు మాట్లాడుతూ... " నిజ జీవితంలో కవితా పాత్రకు నాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, కవిత తనలో తాను వెతుక్కునే అమ్మాయి. తన జీవితంలో తన చుట్టు ఉన్నవారితో సంబంధాలను, అలాగే తనకు తానే సంబంధాన్ని వెతుక్కుంటూ.. ఆమెలో ఆమెను గుర్తించే ఓ చిన్న అమ్మాయి. అయితే ఈ విషయంలో మాత్రం నేను కాస్త భిన్నం. కవిత పాత్రలో ఈ విషయమే నన్ను ఆకర్షించింది. తాను చాలా ఉద్రేకపరురాలు, ఈ విషయంలో నాకు చాలా తనకు చాలా వ్యత్యాసం ఉండటంతో తనలా ప్రవర్తించడానికి చాలా కష్టం అనిపించింది. మేము రిహార్సల్స్‌లో కూడా చాలా కష్టపడ్డాము." అని చెప్పింది.
 
మదర్ థెరిసా పాత్రలో జీవించిన నటి జాక్వెలిన్ ఫిట్షి-కోర్నాజ్ కు నటలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో కమల్ ముసలే, రిచర్డ్ ఫ్రిట్‌షీ మరియు థియరీ కాగియానట్‌లతో కలిసి ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాల ద్వారా తెలకెక్కించడం జరిగిందని విడుదల తర్వాత ఈ చిత్రానికి వచ్చే లాభాలను అనాధాశ్రమాలకు, ఆరోగ్యం విద్య వంటి సంక్షేమశాలలకు అందజేయబోతున్నట్లు తెలిపారు. 
 
దీప్తి నావెల్ ఒక అమెరికన్ నటి ఆమె చాలా చిత్రాలలో హృదయాన్ని హత్తుకునే పాత్రలతో పాటు చాలా శక్తివంతమైన పాత్రలను పోషించింది.
ఆమె 1980లో ఏక్ బార్ ఫిర్‌ సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఇప్పటివరకు 90 చిత్రాలకు పైగా నటించింది. అందులో అందరి ప్రశంసలు అందుకుని ఆస్కార్కు సైతం నామినేటెడ్ అయినా లయన్ చిత్రం ఉండటం విశేషం. దీప్తి ముఖ్యంగా ఆర్ట్ సినిమాలతో గుర్తింపు పొందింది. మదర్ తెరిసా గా ఈ సినిమాలో ఆమె నటించిన పాత్రకు, కనబరిచిన సున్నిత భావాలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారత దేశంలోని మారుతున్న మహిళలకు ఈ పాత్ర అద్దం పడుతుంది.
 
కమల్ ముసలే ఈయన స్విస్-ఇండియన్ ఫిల్మ్ మేకర్, ఇప్పటివరకు 12 సినిమాలు నిర్మించారు. ఇంగ్లండ్‌లోని నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్ నుండి ఫిల్మ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్‌లో కోర్స్ చేశారు. ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, ఆర్ట్ మూవీస్‌తో సహా 30 చిత్రాలను తెరకెక్కించారు. ఆ చిత్రాలను కేన్స్ (ది త్రీ సోల్జర్స్) వంటి ప్రతిష్టాత్మక వేదికల్లో ప్రదర్శించారు. లోకర్నో (అలైన్, రాక్లెట్ కర్రీ) లాంటి అనేక అవార్డులను గెలుచుకున్నారు. 
 
మదర్ థెరిసా & మీ సినిమా కమల్ ముసలే రచనాదర్శకత్వంలో... కర్రీ వెస్ట్రన్ మూవీస్, లెస్ ఫిల్మ్స్ డు లోటస్& కవితా థెరిసా ఫిల్మ్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించబడింది. ఈ సినిమాలో బనితా సంధు, జాక్వెలిన్ ఫ్రిట్షి-కోర్నాజ్, దీప్తి నావల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఈ సినిమాలో విక్రమ్ కొచ్చర్, బ్రయాన్ లారెన్స్, హీర్ కౌర్, కెవిన్ మెయిన్స్, లీనా బైశ్యా, శోబు కపూర్, మహి అలీ ఖాన్, ఫెయిత్ నైట్, జాక్ గోర్డాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అందరూ స్త్రీలే కావడం విశేషం.డీఓపీ గా కైకో నకహరా ది , రేఖ ముసలే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు. నుపూర్ కజ్బాజే బాటిన్ లైన్ ప్రొడ్యూసర్ గా... పీటర్ స్చెరర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అన్నీక్ రోడ్డీ, వాల్టర్ మెయిర్ & లారెన్స్ క్రెవోసియర్ లు స్వరాలను అందించారు. సినీపోలిస్, PEN మరుధర్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు."మదర్ థెరిసా & మీ" 5 మే 2023న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ మధ్యే ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా ఫస్ట్ లుక్ వేడుకను చిత్ర యూనిట్ నిర్వహించారు.