బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (12:29 IST)

అమీర్ ఖాన్ దంపతుల విడాకులు.. కంగనా రనౌత్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లుగా ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. తాజాగా వీరి విడాకులు విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు. కంగనా తన ఇన్‏స్టాగ్రామ్ వేదికగా అమీర్, కిరణ్ రావు విడాకులపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 
"పంజాబ్‏లోని చాలా కుటుంబాలు ఒక సమయంలో ఒక కొడుకును హిందువుగా.. మరొక కొడుకును సిక్కుగా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎవరు అంతగా చూడలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ రెండవసారి విడాకులు తీసుకున్నప్పటికీ.. పిల్లలు మాత్రం ఎందుకు ముస్లీంగా గుర్తించబడతారనేది ఒక ఇంటర్ ఫెయిత్ వివాహంలో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. స్త్రీ ఎందుకు హిందువుగా కొనసాగకూడదు. 
 
మారుతున్న కాలంతోపాటే మనం కూడా దీనిని మార్చాలి. ప్రస్తుతం అవలంభిస్తున్న పద్దతి చాలా పురాతనమైనది. ఒక కుటుంబంలో హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, రాధస్వామి, నాస్తికులు జీవించినట్లే.. ముస్లింలు కూడా ఎందుకు జీవించరు. ముస్లింలను వివాహం చేసుకోవడానికి మరోకరు ఎందుకు మతం మార్చుకోవాలి ? ” అంటూ ప్రశ్నించారు కంగనా.
 
అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వారిద్దరు ఆజాద్‏కు తల్లిదండ్రులుగానే వ్యవహిస్తామని చెప్పారు అమీర్ దంపతులు.