మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 7 జులై 2025 (10:55 IST)

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

Rishab Shetty, Kantara Chapter 1 poster
Rishab Shetty, Kantara Chapter 1 poster
ఇతిహాసాలు పుట్టిన చోట, అడవి గర్జనలు ప్రతిధ్వనిస్తాయి అంటూ కాంతార చాప్టర్ 1 గురించి నేడు విడుదలచేసిన పోస్టర్ లో వెల్లడించారు. ఇంతకుముందు వచ్చిన కాంతారా లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ఇది ప్రీక్వెల్. ఆ దిగ్గజం వెనుక ఉన్న అద్భుతమైన శక్తి కి రిషబ్ శెట్టి దివ్యమైన, అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాక కాంతారాచాప్టర్1 అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లోకి వస్తుంది అని వెల్లడించింది.
 
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ప్రీక్వెల్‌ను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార చాప్టర్ 1’ నుంచి మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం తో యుద్ధం చేస్తున్న రిషబ్ శెట్టి మనకు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.