గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (15:38 IST)

రూ.100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తున్న 'సర్దార్'

sardar collections
హీరో కార్తీ నటించిన తాజా చిత్రం "సర్దార్". గత నెల 21వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకుని పాన్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసిన చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తెలుగులోకి అనువాదం చేసిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. 
 
ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రజీషా విజయన్, రాశీఖన్నాలు నటించారు. తొలి రోజునే హిట్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లో ఏకంగా రూ.85 కోట్ల మేరకు వసూలు రాబట్టినట్టు ఆ చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
పైగా, రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రంలో దశ భక్తుడైన తండ్రి పాత్ర గూఢచారిగా, నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ ద్విపాత్రిభినయం చేసి మెప్పించారు. ఈ పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీర్పు చాలా బాగా వచ్చింది.