శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (11:02 IST)

నాపై అత్యాచారయత్నం ఆరోపణలా? సునీతపై కేసు పెడతా: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో వివాదాస్పదమైనాయి. ఇంకా సునీత వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ తనను అత్యాచారం చేయబోయాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో వివాదాస్పదమైనాయి. ఇంకా సునీత వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సునీత, ఆమెను రెచ్చగొట్టిన కొణిదల ప్రొడక్షన్స్‌‌పై కేసు పెట్టనున్నానని.. రూ.50లక్షలకు పరువునష్టం దావా వేస్తున్నట్లు కత్తి మహేష్ వెల్లడించాడు.
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన కత్తి మహేష్.. తనపై ఆరోపణలే నిజమైతే సునీత పోలీస్ కేసు పెట్టాలని.. అప్పుడే నిజానిజాలేంటో తెలుస్తాయన్నాడు. కాగా..  ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సునీత, తాను ఓ అవకాశం కోసం కత్తి మహేష్ వద్దకు వెళ్లగా, ఆయన అత్యాచారయత్నం చేశాడని ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇంకా కత్తి మహేష్‌ అనుసరించిన దానిపై తన వద్ద ఆధారాలున్నాయని.. వేరే వ్యక్తులపై తాను ఆరోపణలు చేయట్లేదని సునీత చెప్పుకొచ్చింది. ఆధారాలు లేకుంటే ఆరోపణలు చేయలేదని... సినీ ఇండ్రస్టీలో మహిళలకు ఇబ్బందులున్నాయని సునీత వెల్లడించింది.