ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:33 IST)

జమునకు కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చిందా?: సావిత్రి గారి గురించి బాగా తెలుసు..

అలనాటి తార సావిత్రి జీవితకథను దర్శకుడు నాగ అశ్విన్ ''మహానటి'' పేరిట బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే కీర్తి సురేష్‌ను మహానటిగా తీసుకోవడంపై సినీ తార,

అలనాటి తార సావిత్రి జీవితకథను దర్శకుడు నాగ అశ్విన్ ''మహానటి'' పేరిట బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే కీర్తి సురేష్‌ను మహానటిగా తీసుకోవడంపై సినీ తార, సావిత్రికి సన్నిహితురాలు అయిన జమున చురకలంటించారు. అసలు తెలుగు భాష రానివాళ్లను ఈ సినిమాలో నటింపజేశారని కామెంట్స్ చేశారు.
 
అలాగే మహానటి సినిమా గురించి తన వద్ద ఎవ్వరూ సంప్రదించలేదన్నారు. సావిత్రి జీవితం గురించి తనకు తెలియని విషయమంటూ లేదని.. అలాంటి సావిత్రి సినిమా తీస్తూ ఎవ్వరూ తనను సంప్రదించకుండా ఎలా వుంటారని అడిగారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం కీర్తి సురేష్ స్పందించినట్లు తెలుస్తోంది. సావిత్రిగారి గురించి తాను పూర్తిగా తెలుసుకున్నానని.. ఆమె నటించిన చాలా సినిమా చూశానని తెలిపారు. 
 
సావిత్రిగారి హావభావాలను పరిశీలించానని, ఆమెకు సంబంధించిన పుస్తకాలను చదివి, మహానటి బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నానని కీర్తి తెలిపింది. అంతేగాకుండా సావిత్రిగారి కుమార్తె చాముండేశ్వరిని కూడా కలుసుకుని మరిన్ని విషయాలు తెలుసుకున్నానని కీర్తి వ్యాఖ్యానించింది. ఆమె పాత్రలో ఒదిగిపోయేందుకు చాలా విషయాలు నేర్చుకున్నట్లు కీర్తి చెప్పుకొచ్చింది.