ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (15:54 IST)

''సావిత్రి'' బాటలో కీర్తి సురేష్.. యూనిట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఎలా?

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో అధికంగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు. ఈమె నటించిన సినిమాలు హిట్ కాకపోయినా.. కీర్తి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా తెలుగులో పవర్ స్టార్ పవన్ సరసన '

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో అధికంగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు. ఈమె నటించిన సినిమాలు హిట్ కాకపోయినా.. కీర్తి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా తెలుగులో పవర్ స్టార్ పవన్ సరసన ''అజ్ఞాతవాసి''లో నటించిన కీర్తి సురేష్.. మరోవైపు అలనాటి అందాల తార 'సావిత్రి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కే 'మహానటి' చిత్రంలోనూ నటిస్తోంది.
 
ఇందులో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపిస్తోంది. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌ ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ స్వీట్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. మహానటి సావిత్రి నటిగా ఉన్న కాలంలో తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వడం అలవాటు.
 
అదే అలవాటును సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కొనసాగించింది. 'మహానటి' సినిమాకు పనిచేసిన యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను కీర్తి కానుకగా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్‌ సర్‌‌ప్రైజ్‌‌తో యూనిట్‌ సభ్యులు షాక్ అయ్యారు.