ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:38 IST)

అట్లీ బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.. ముగ్గురు హీరోయిన్లలో..?

రఘుతాత చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి జవాన్ దర్శకుడు, కీర్తి సురేష్ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వహిస్తున్నాడు. 
 
తమిళంలో తెరకెక్కనున్న తేరీ చిత్రానికి రీమేక్‌గా బేబీ జాన్ రాబోతుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. 
 
అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్‌లోని ఇద్దరూ టాప్ హీరోలు కథానాయకులుగా నటిస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, వీరిలో కీర్తి సురేష్ ఒకరని తెలుస్తోంది.