మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (17:21 IST)

కలెక్షన్లపరంగా కుమ్మేస్తున్న కేజీఎఫ్

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా రూపుదిద్దుకున్న సినిమా కేజీఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ.80కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కన్నడ, హిందీలోను ఈ సినిమా ఒక రేంజ్‌లో వసూళ్లను రాబడుతోంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.150కోట్లను రాబట్టింది. 
 
ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు నీల్ వాస్తవానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించడం, ప్రతి పాత్రను సహజత్వంలో మలిచిన తీరు.. అదుర్స్ అనిపించింది. ఇంతవరకు హిందీ వర్షన్ ద్వారా రూ.26కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశాడు.