గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (21:34 IST)

లక్మీ రాయ్ మూవీ ఝాన్సీ ఐపీఎస్ తెలుగు రైట్స్ దక్కించుకున్న డాక్టర్ ఆర్కే గౌడ్

Lakmi Roy
Lakmi Roy
లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురు ప్రసాద్ దర్శకత్వంలో,  తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని  సాధించిన చిత్రం "ఝాన్సీ ఐపీఎస్".  ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. సూపర్ హిట్ సినిమా కావటంతో తెలుగు రైట్స్ పొందటానికి ఎంతోమంది నిర్మాతలు పోటీపడినప్పటికి ఆర్ కె ఫిలిమ్స్ వారిని అదృష్టం వరించింది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..  మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో లక్ష్మీ రాయ్ చాలా అద్భుతంగా నటించారు. అందులో ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేస్తూ కాలేజ్ అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసే ముఠాని ఆట కట్టించే పాత్రలో లక్ష్మీరాయ్ చాలా అద్భుతమైన ఫైట్స్ చేశారు గతంలో ఏ సినిమాలో కూడా చేయనటువంటి సూపర్ యాక్షన్ క్యారెక్టర్లో నటించింది లక్ష్మీ రాయ్. అలాగే భూ కబ్జా చేసి కట్టిన బిల్డింగులు నేలమట్టం చేసి, కబ్జారాయుళ్ల గుండెల్లో నిద్రపోయే  ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఈ క్యారెక్టర్ నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ప్రేమ, యాక్షన్ సెంటిమెంట్స్‌తో కథ  మిళితమై ఉంటుంది.
 
ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్  లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన ఫైట్స్ చూడటానికి యువత ఎగబడతారు. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి.   సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ట్రైలర్  త్వరలో రిలీజ్ చేసి, నవంబర్ లో  అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.