బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:36 IST)

''లక్ష్మీ''తో వస్తున్న ప్రభుదేవా (వీడియో)

డ్యాన్స్ లెజెండ్, దర్శకుడు ప్రభుదేవా తాజా సినిమా ''లక్ష్మి'' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాన్స్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో డ్యాన్స్ మాస్టర్.. ఆయన శిష్యురాలి మధ్య జరిగే సన్ని

డ్యాన్స్ లెజెండ్, దర్శకుడు ప్రభుదేవా తాజా సినిమా ''లక్ష్మి'' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాన్స్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో డ్యాన్స్ మాస్టర్.. ఆయన శిష్యురాలి మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా వున్నాయి. డ్యాన్స్ ఇతివృత్తంగా ఇప్పటికే స్టైల్, ఏబీసీడీ వంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. 
 
ప్రభుదేవా కీలకపాత్రగా 'అభినేత్రి' సినిమా చేసిన ఎ.ఎల్.విజయ్ (అమలాపాల్ మాజీ భర్త) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వీడియో రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి..