రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూ.. డ్రగ్స్ దందా వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటున్న లావణ్య (video)
రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. లావణ్య రాజ్ తరుణ్ గత కొంతకాలంగా రిలేషన్‌లో వున్నారని ఆమె మీడియాతో వెల్లడించింది. తాజాగా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూపై ఓ వీడియో విడుదల చేసింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం లావణ్యకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై లావణ్య స్పందించింది. తాజాగా వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లోని పాత వీడియోలు అని లావణ్య తెలిపింది. తనపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే ఇప్పుడు బయటపెడుతున్నారని వెల్లడించింది.
ఆ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇకపోతే.. లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాగే సోషల్ మీడియా ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్‌లో పెట్టినట్లు, కళ్లద్దాల బాక్సులో పెట్టమంటూ మరో ఆడియోలు వచ్చాయి. ఈ వీడియోకు తనకు సంబంధం లేదని లావణ్య తాజా వీడియోలో క్లారిటీ ఇచ్చింది.