లావణ్యను లవ్ అని, అనుపమను ఉప్మా అని పిలుస్తా.. ఐ లవ్ ఉప్మా: రామ్
చాలా గ్యాప్ తర్వాత దేవదాసు హీరో రామ్ ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ఈ చిత
చాలా గ్యాప్ తర్వాత దేవదాసు హీరో రామ్ ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన లావణ్య త్రిపాఠిని లవ్ అని పిలుస్తానని.. అనుపమ పరమేశ్వరన్‌ను ఉప్మా అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో కొత్తదనం వుంటుందని.. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరి ఫ్రెండ్‌షిప్‌కి వాళ్లే సరైన నిర్వచనం ఇచ్చుకోగలరని రామ్ తెలిపాడు. ఈ సినిమా చూశాక చాలామంది తమ స్నేహాన్ని పోల్చుకుంటారని వెల్లడించాడు.
సినిమా సెట్‌లో అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ లావణ్యను లవ్ అని పిలిచేవాళ్లం.. అలాగే అనుపమను ఉప్మా అని పిలిచేవాడిని. వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అని అడిగితే మాత్రం "ఐ లవ్ ఉప్మా" అని చెబుతానని చెప్పుకొచ్చాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన సినిమా స్రవంతి రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న విడుదల కానుంది.