మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (09:38 IST)

టాలీవుడ్‌లో విషాదం - అలనాటి నటి జమున (హంపి సుందరి) ఇకలేరు..

jamuna
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కర్నాటక రాష్ట్రంలో హంపి సుందరిగా గుర్తింపు పొందిన అలనాటి నటి జమున కన్నుమూశారు. ఆమెకు వయసు 86 సంవత్సరాలు. హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత 1936 ఆగస్టు 30వ తేదీన కర్నాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించారు. అందుకే ఆమెను కన్నడిగులు జమునను హంపి సుందరిగా పిలిచేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతూ వచ్చారు. తన 14 యేళ్ల ప్రాయంలో అంటే 1950లో చిత్రపరిశ్రమలోకి బాలనటిగా రంగప్రవేశం చేసిన ఆమె... దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. 1958లో "భూకైలాస్" చిత్రంతో హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 
 
తన అందంతోనే కాకుండా అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను ఆలరించారు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు చిత్రపరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆమె రాణించారు.
 
1989 నుంచి 1991 వరకు రాజమండ్రి టీడీపీ ఎంపీగా కొనసాగారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన "మూగమనసులు" చిత్రాన్ని హిందీలోకి "మిలాన్" పేరుతో అనువదించగా, ఈ చిత్రానికి ఆమెకు 1964లో తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. కానీ, "మిలాన్" తర్వాత ఆమెకు హిందీలో సరైన సినిమా అవకాశాలు రాలేదు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.