బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (17:51 IST)

రిపబ్లిక్ డే.. 901 మందికి పోలీసు పతకాలు

Republic Day
Republic Day
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసులు పతకాలను తాజాగా ప్రకటించింది. 140మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పతకాలు, 668 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 
 
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 140మందిలో అత్యధికంగా 48 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు వున్నారు.  తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం, 13 మందికి పోలీస్‌ విశిష్ట సేవాల పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి అదనపు డీజీ అతుల్‌ సింగ్‌, 6వ బెటాలియన్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకటరావులకు పతకాలు లభించనున్నాయి. అలాగే  తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్‌ కుమార్‌, 12వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు.