ఓ ఇంటివాడైన హీరో సిద్ధార్థ్... హీరోయిన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో
హీరో సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ ఆదితిరావు హైదరీని ఆయన రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఈ వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి అనుమతించలేదు.
కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి వివాహ ఘట్టాన్ని పూర్తి చేశారు. నిజానికి ఆదితీరావు హైదరీ, సిద్ధార్థ్‌లు గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. పలు సందర్భాల్లో వీరిద్దరూ త్రినేత్రమైన కెమెరా కంటికి చిక్కారు. కాగా, వీరిద్దరూ "మహా సముద్రం" అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు రూమర్స్. కాగా, హీరో శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన విషయం తెల్సిందే.