గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (19:02 IST)

'లవ్ స్టోరీ' దర్శకుడు చేతుల మీదుగా 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' ఫస్ట్ లుక్

సక్సెస్‌ఫుల్ దర్శకుడు శేఖర్ కుమ్ముల చేతు మీదుగా వస్తున్నా.. వచ్చేస్తున్నా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌గోల్డ్‌ ఫిష్‌ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటించారు. అందాల భామ మిస్తి చక్రవర్తి హీరోయిన్. 
 
తేజ స్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశె ట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ..‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
 
అలాగే, దర్శక నిర్మాత సందీప్‌ గోపిశెట్టి మాట్లాడుతూ…‘ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములతో మా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎ న్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. 
 
పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు.