గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (12:35 IST)

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించిన కరాటే కళ్యాణి.. "మా" నోటీసులు

కృష్ణుడి రూపంలో ఉన్న స్వర్గీయ ఎన్.టి.రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని సినీ నటి కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న కరాటే కళ్యాణి... ఖమ్మంలోని లంకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి రూపంలో ఉండే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలంటూ డిమాంట్ చేస్తున్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి విగ్రహంతో కమ్మ, యాదవులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దన్నారు. దీన్ని సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియ అంటూ ఆరోపించారు. అయితే, కల్యాణి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
ఈ వ్యాఖ్యాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కన్నెర్రజేసింది దివంగత సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కల్యాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఆమె ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సివుంది.