సోమవారం, 11 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:18 IST)

ప‌గ పగ పగ ఆద‌ర‌ణ‌పొందినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపిన సంగీత దర్శకుడు, నటుడు కోటి

Abhilash Sunkara,  Ram Sunkara,  karati kalayani,  koti , Ravi Sri durga prasad
Abhilash Sunkara, Ram Sunkara, karati kalayani, koti , Ravi Sri durga prasad
`నేను ఈ రోజు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను `దేవినేని` సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. ఆ తర్వాత చిరంజీవి గారు సైతం ఆర్టిస్ట్ గా చెయ్యమని బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. మెదట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేద్దాం అని వచ్చిన నన్ను ఇందులో యాక్టింగ్ కూడా  చేయించారు. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22 న విడుదలైన అన్ని థియేటర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న మా సినిమాను  ఇంకా పెద్ద విజయం సాదించేలా చేయాలని కోరుకుంటున్నాన‌ని` సంగీత దర్శకుడు కోటి  అన్నారు.
 
సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో  సత్య నారాయణ సుంకర వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ ఎత్తున నిర్మించిన   చిత్రం "పగ పగ పగ".ప్రముఖ సంగీత  దర్శకుడు  కోటి  సంగీతం అందించారు.అన్ని కార్యక్రమాలు  పూర్తి చేసుకొని ఈ నెల 22 న గ్రాండ్ రిలీజైన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా  ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. 
 
ఈ సందర్బంగా  చిత్ర దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..నేను ఈ రోజు డైరెక్టర్ కావడానికి కారణమైన మా దర్శక గురువులకు ధన్యవాదములు. నేను చెప్పిన కథ విని ఎంతో ఎగ్జైట్ అయి ఈ సినిమా తియ్యడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు  ధన్యవాదములు. సంగీత దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ అలాగే  అద్భుతంగా నటించారు.  ఫుల్ లవ్ & కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ తో ఈ  నెల 22 న విడుదలైన  ఈ సినిమా అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. చూడని వారు  వెళ్లి చూసి మమ్మల్ని మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..
 
నిర్మాతలు సత్య నారాయణ  సుంకర & ఫైట్  మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ..మా స్టంట్ మాస్టర్ యూనియన్ సపోర్ట్ వల్లే మేము ఈ సినిమా తియ్యగలిగాము. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో  ఈ చిత్రం తీయడం జరిగింది.  కోటి గారితో  వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుల సపోర్ట్ మరవలేనిది. అందరూ చాలా బాగా నటించారు.మంచి కంటెంట్ తో  వచ్చిన మా సినిమాను అదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ నెల 22 న విడుదలైన అన్ని థియేటర్స్ లలో కూడా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు.ప్రేక్షకుల నుండి  వచ్చిన రెస్పాన్స్ తో ఇంతకాలం మేము పడిన కష్టం అంతా వారి ఆదరణతో మరచిపోయాం అన్నారు.
 
నటి  కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక  నిర్మాతలకు ధన్యవాదాలు  ఇది కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో చాలా బాగా నటించాడు..తన తమ్మున్ని హీరోగా నిలబెట్టడానికి  సత్య నారాయణ సుంకర, ఫైట్ మాస్టర్ రామ్ లు బ్యానర్ స్థాపించి ఎంతో కష్టపడి ఈ సినిమా తీయడం జరిగింది. అలాగే కోటి గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలలో నటించాలని కోరుతున్నాను. 
 
చిత్ర హీరో అభిలాష్ సుంకర మాట్లాడుతూ..ఇప్పటివరకు ఫైటర్ గా  నేను  320 సినిమాలకు వర్క్ చేశాను. మా అన్నలు నన్ను నమ్మి నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. వారికి నా పాదాభివందనాలు, దర్శకులు రవి గారు మంచి కథ ఇచ్చి మమ్మల్ని  బాగా డైరెక్ట్ చేశారు. కోటి గారి మ్యూజిక్ వింటూ పెరిగిన నేను తనతో కలసి నటించడంతో పాటు, మ్యూజిక్ కూడా తనే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.
 
నటుడు జబర్దస్త్ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించాను. ఏ తండ్రి అయినా కొడుకు బాగుండాలి అని ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. కానీ ఒక తమ్మునికోసం  ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం చాలా గ్రేట్ అన్నారు 
 
నటుడు సంపత్  మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి కోటి గారు. నా క్యారెక్టర్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.