గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 సెప్టెంబరు 2022 (20:33 IST)

Madhuri Dixit 55 ఏళ్లు దాటినా డ్యాన్స్ స్టెప్పులతో చంపేస్తున్న మాధురీ దీక్షిత్

Madhuri Dixit
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ అమృతం ఏమయినా తాగారా? ఇది నెటిజన్లు అనుకుంటున్న మాట. 55 ఏళ్లు వచ్చినా చలాకీ చిన్నదిలా డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతోంది ఈ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.

 
Madhuri Dixit
స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ద్వారా మాధురీ దీక్షిత్ నటించిన ''మజా మా'' రాబోతోంది. సెప్టెంబర్ 15 బుధవారం నాడు దీనిపై ప్రకటన విడుదల చేసారు. మాధురీ దీక్షిత్ ఇలా రెండవసారి ఓటీటీ ద్వారా కనిపించనున్నారు. మాధురీ దీక్షిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేసింది. మజా మా అక్టోబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

 
మజా మా కోసం మాధురీ చేసిన గర్బా డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. 55 ఏళ్లు నిండినా చార్మింగ్ లుక్‌తో మాధురీ వేస్తున్న స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.