ముంబైలో తెలుగు నటిపై అత్యాచారం.. ఎలా మోసపోయింది?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తెలుగు చిత్రసీమకు చెందిన ఓ నటి అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి మాటెత్తగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. మరోమారు పెళ్లి అనే మాటను ప్రస్తావిస్తే ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలు ముంబై పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య కపూర్ అనే వ్యక్తి ఫిట్నెస్ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని ఓ తెలుగు సినీ నటి ఆదిత్యకు పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నెలలు గడిచిపోతున్నప్పటికీ పెళ్లి మాటెత్తలేదు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు ఆదిత్యను నిలదీసింది. దీంతో ఆగ్రహించిన ఆదిత్య.. ఎదురు తిరిగాడు. మరోమారు పెళ్లి మాటెత్తితో తనతో సన్నిహితంగా ఉన్న ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదిత్య కపూర్‌ను అరెస్టు చేశారు.