మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:02 IST)

పాత్రాచల్ స్కామ్ : బెయిల్‌కు దరఖాస్తు చేసుకోని సంజయ్ రౌత్

sanjay rauth
పాత్రాచల్ కుంభకోణం అరెస్టు అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరో 14 రోజుల పాటు జైలులోనే ఉండనున్నారు. ఆయన ఈ కేసులో బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరో 14 రోజుల పాటు జైలు జీవితాన్నే గడపనున్నారు. తొలుత ఆయనకు విధించిన రిమాండ్ సోమవారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచడంతో మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడగించింది. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. 
 
మహారాష్ట్రలో వెలుగు చూసిన పాత్రాచల్ స్కామ్‌లో సంజయ్ రౌత్ పాత్ర ఉందని ఆరోపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన నివాసం, కార్యాలయాల్లో పలు దఫాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత ఆయనపై మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ ముగిసినప్పటికీ కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించిన విషయం తెల్సిందే. 
 
ఆయనకు కస్టడీ సోమవారంతో ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కానందున రౌత్‌ను తిరిగి జ్యూడిషియల్ రిమాండ్‌లోనే ఉంచాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. అదే సమయంలో బెయిల్ ఇవ్వాలంటూ రౌత్ పిటిషన్ దాఖలు చేయడం లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుక చెప్పారు. దీంతో ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు రౌత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.