మహేష్ బాబు తాజా లుక్ అదుర్స్.. నెట్టింట వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. మహేష్ బాబు ఫోటోలను ఆయన సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మహేశ్ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కూతురు సితారతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు.
మహేశ్, సితార సెల్ఫీ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెల్ఫీ ప్రత్యేకత ఏంటంటే మహేష్ యంగ్ లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సితారతో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో కొత్త సినిమాతో వస్తోంది. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదే సమయంలో ఈ సినిమాకి సర్కార్ వారి పాట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్‌ని బట్టి చూస్తుంటే మహేష్ కొత్త సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.