గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (16:36 IST)

సెన్సార్ జరుపుకుంటున్న గుంటూరు కారం లేటెస్ట్ అప్ డేట్

Mahesh Babu - Meenakshi Chaudhary
Mahesh Babu - Meenakshi Chaudhary
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించిన సినిమా  'గుంటూరు కారం'. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న సినిమా. ఈ సినిమా అంతా సిద్ధమై ఇంకా 8 రోజుల్లో విడుదలకానున్నదని లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. 
 
కాగా, నేడు గుంటూరు కారం సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సీనియర్ సిబ్బంది ఈ చిత్రాన్ని తిలకిస్తున్నారు. మొదటి భాగం సరదాగా సాగుతూ, సెకండాఫ్ లో కాస్త వయెలెన్స్ వుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇందులో సూపర్ స్టార్ క్రిష్ణ ను గ్రాఫిక్స్ ద్వారా అభిమానులను అలరించనున్నారు. ఇక ఈ సినిమా యుఎ సర్టిఫికెట్ రానున్నదని తెలుస్తోంది. కుటుంబమంతా కలిసి చూడతగ్గ సినిమాగా వుండబోతుంది. సంక్రాంతి సినిమాల్లో తప్పనిసరి విడుదల సినిమాగా గుంటూరు కారం వుంది.