1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (13:04 IST)

ఫ్లాష్ బ్యాక్ పాఠాల నుంచి కొత్త ఏడాదికి స్వాగతిస్తున్న సినిమా పరిశ్రమ

chiru-pavan-prabahs-allu arjun
chiru-pavan-prabahs-allu arjun
సినిమా భాషలో ఫ్లాష్ బ్యాక్ అయింది 2023 వ సంవత్సరం. 20204 కు స్వాగతిస్తూ కొత్త ఏడాదికి అందరికీ శుభం కలగాలని సినిమా రంగంలోని అన్ని శాఖలూ ఆవిస్తున్నాయి. ముఖ్యంగా గత రాత్రి అంటే డిసెంబర్ 31 న అగ్ర హీరోలు, హీరోయిన్లు, కొంతమంది సాంకేతిక సిబ్బంది విదేశాల్లో తమ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. గాయని సునీత కూడా తన కొడుకు ఆకాష్ హీరోగా చేసిన సర్కారు నౌకరి సినిమా ప్రమోషన్ తో పాటు వ్యక్తిగత పనిమీద అమెరికా వెళ్ళింది. అక్కడే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది.
 
ఇక హైదరాబాద్ లో రాత్రి ఎఫ్.ఎన్.సి.సి. లో పాత ఏడాది వీడ్కోలు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, చిన్నపాటి హీరో హీరోయిన్లు హాజరయ్యారు. 
 
ఇక అగ్రహీరో నాగార్జున విషయానికి వస్తే, గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అందుకు ప్రతిగా బిగ్ బాస్ షోను డీల్ చేస్తూ, కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వున్నారు. గత ఏడాది బీజం చేసిన నా సామిరంగా సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.  అదేవిధంగా తమిళ సినిమా ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు నిర్మాతలు. 
 
మెగాస్టార్ చిరంజీవికి గత ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వాల్తేర్ వీరయ్య సినిమాలో రవితేజ సోదరుడిగా నటించి ఆ చిత్రం కాస్త విజయాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత భోళా శంకర్ సినిమా బోల్తాపడిందనే చెప్పాలి. ఇక దర్శకుడు వశిష్ట తో కొత్త సినిమాను ఆరంబించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన ఈ సినిమాలో చిరంజీవి షూట్ ఈ సంక్రాంతికి పట్లాలెక్కనుంది. ఇప్పటికే మాట ఇచ్చిన అనిల్ రావిపూడితో పలువురు దర్శకుడు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారు.
 
మళ్లీ బోయపాటితో..
గత ఏడాది రెండు సినిమాలతో సక్సెస్ ఇచ్చిన నందమూరి నట సింహం వీరసింహా రెడ్డి, భగవత్ కేసరి తో నిరూపించాుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఏడాది సెట్ పైకి వెళ్ళాల్సింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు, చంద్రబాబు అరెస్ట్ తో షూటింగ్ వాయిదా వేసుకోవడంతో ఆలస్యం అయింది. ఇక ఆంధ్రలో ఏప్రిల్ లో ఎలక్షన్లు హడావుడి వుంది. ఈలోగా కొత్త పార్ట్ పూర్తి చేద్దామని బాబీ సిగ్నల్ ఇచ్చాడు. ఎందుకనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూద్దాం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత బోయపాటి ఇప్పటికే మరో కథను రెడీ చేసుకుని సిద్ధంగా వున్నాడు.
 
వెంకటేష్ సైంథవ్ తో
 గత ఏడాది వెంకటేష్ కు హిట్ లేదు. వెండితెరపై రావాల్సిన రానా నాయుడు వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చింది. అది పెద్దగా ఆకట్టుకోకపోయినా నెట్ ఫ్లిక్స్ తో మరింత ఫేమస్ అయ్యారు.  ఈసారి కూతురు సెంటిమెంట్ తో సైంథవ్ అని రాబోతున్నాడు. ఇటీవలే తన 75 వ సినిమాగా పెద్ద ఫంక్ష న్ చేసి సక్సెస్ అయ్యాడు. అందులో చిరంజీవితోకలిసి నటించాలనుందని స్టేట్ మెంట్ ఇచ్చారు.  అన్నీ కుదిరితే ఈ ఏడాది ఇద్దరి కలయికతో రాబోతుంది.
 
పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది కీలకం
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది కీలకం కానుంది. కుదిరితే ఓ కప్పు కాఫీ అన్నట్లు తనకు రాజకీయాల నుంచి కాస్తవిరామం దొరికినప్పుడల్లా సినిమా సెట్ లోకి వెళుతున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా సిద్దం అయింది. ఆంధ్రలో ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను శ్రియారెడ్డి పోషించింది. ఆమెతో పవన్ కళ్యాణ్ ఫైట్ కూడా వుంటుందని ఇటీవలే ఆమె తెలిపింది. ఇక ఈ సినిమాతోపాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సిసినిమాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందు వల్ల ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో చూడాలి.
 
రాజమౌళితో మహేష్ బాబు సినిమా.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం గత ఏడాది పూర్తయింది. దాన్ని ఈ సంక్రాంతికివిడుదల చేస్తున్నారు. టైటిల్ పై డివైడ్ టాక్ వున్నా, మాస్ యాక్షన్ సినిమాగా రాబోతుంది. పైగా త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకడు రాజమౌళితో అంతర్జాతీయ సినిమా చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కథ కూడా విజయేంద్రప్రసాద్ సిద్ధం చేసినట్లు చెప్పారు.
 
ఇక ఎన్.టి.ఆర్. తాజాగా దేవర సినిమాతో ఈ ఏడాది ఏప్రిల్ లో రాబోతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇంకోవైపు బాలీవుడ్ సినిమా వార్ 2 లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
అలాగే యూత్ ఐకాన్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 కు సిద్ధం అవుతున్నారు. ఆగస్టులో ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. ఆ సినిమా తర్వాత జులాయి బోడీగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రెడీ అయింది. మరోవైపు యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ కథను ఇప్పటికే అల్లు అర్జున్ కు వినిపించారు.
 
రామ్ చరణ్ తాజా సినిమా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ రాబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో అది థియేటర్లలో రాబోతుంది. ఇందులో రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఆ తర్వాత బుజ్జిబాబు దర్శకత్వంలో సినిమాకు సిద్ధమవుతాడని తెలుస్తోంది. మరోవైపు హాలీవుడ్ ప్రాజెక్ట్ వున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
 
రెబల్ స్టార్ ప్రభాస్ అయితే, గత ఏడాది ఆదిపురుష్ తో ఫెయిల్యూర్ చవిచూశారు. కానీ చివర్లో సలార్ తో ఒక్క సారిగా హిట్ ఇచ్చి శుభారాంభం ఇచ్చారు. దాని రెండెో భాగం ఈ ఏడాదిషూట్ జరగనుంది. మరోవైపు నాగ్ అశ్విన్ కాంబినేష న్ లో పాన్ వలర్డ్ సినిమాగా కల్కి 2989 సిద్ధం అవుతుంది. మేలో విడుదలకానున్న ఈ సినిమా సైంటిఫిక్ అంశంతో రూపొందుతోంది. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొంత షూట్ అయింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ రాబోతుంది. ఇదికూడా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించనున్నారు.
 
అలాగే విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషితో మిశ్రమ స్పందన రాబట్టుకున్నాడు. త్వరలో ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ రాబోతుంది.
అదేవిధంగా రవితేజ కూడా గత ఏడాది ఫెయిల్యూర్ దక్కాయి. ఈ ఏడాది ఈగిల్, మిస్టర్ బచ్చన్ తో రాబోతున్నాడు.