నాగవంశీని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే?
నిర్మాత నాగవంశీని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడమే ఇందుకు కారణం.
సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో.. ఈ సినిమా నుంచి ఎలాంటి ట్రైలర్, సాంగ్స్ రాకపోవడంపై ప్రిన్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌లో #DummyProducerNagaVamsi అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ ట్వీట్ 30 నిమిషాల్లో దాదాపు 20K ట్వీట్లకు పెరిగింది. దీంతో గుంటూరు కారం నుంచి సింగిల్ డిసెంబర్ 11 సోమవారం వస్తుందని సినీ యూనిట్ ప్రకటించింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత, అభిమానులు #GoodProducerNagaVamsi అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు.