మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలకు హనుమాన్ పోటీ కాదు- తేజ్ సజ్జ
ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలి వేస్తే ఆవకాయ కోరుకుంటాం. అందుకే ఈరోజు ఆవకాయ్.. ఆంజనేయ.. అనే పాటను ఈరోజు విడుదల చేశాం. సాహితీ అద్భుతంగా గానం చేశారు. హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. జనవరి సంక్రాంతి పండుగ్గకు థియేర్ లో హనుమాన్ పండుగ చేసుకుందాం - అని కథానాయకుడు తేజ్ సజ్జ అన్నారు.
జాంబి రెడ్డి తర్వాత ఆయన చేసిన చిత్రమిది. సంక్రాంతికి పెద్ద హీరోల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు వున్నాయని అంటున్నారు. వున్నా, అన్ని సినిమాలు ఆడాలి. మా సినిమా ఆడుతుంది. పెద్ద హీరోలకు హనుమాన్ పోటీ కాదు అని తేజ్ సజ్జ తెలిపారు.
జాబిరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ, హనుమాన్ సినిమాలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. సినిమా బాగా వచ్చింది. త్రీడి ఫార్మెట్ కూడా వుంది. ఈ సినిమాలో సిగరెట్, మద్యం వంటివి లేకుండా చేశాం. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం అన్నారు.