మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:38 IST)

శ్రీరాం, జయరాం, జయ జయరాం.. అంటే చాలు.. హనుమ..?

ప్రతిక్షణం శ్రీరామ ధ్యానంలో వుండే హనుమంతుడి అనుగ్రహం పొందడం చాలా సులభమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నాడు. హనుమంతుడి ఆశీసుల కోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే.. శ్రీరామ నామాన్ని జపం చేయడం. 
 
"శ్రీరాం, జయరాం, జయ జయరాం!" అనే మంత్రాన్ని స్మరిస్తే చాలు.. రామా అంటే చాలు అక్కడ హనుమంతుడు వచ్చి వాలిపోతాడు. అలాగే వడమాల, తమలపాకుల మాలను సమర్పిస్తే హనుమంతుడు అనుగ్రహిస్తాడు. ఈతిబాధలను తొలగిస్తాడు. కార్యసిద్ధి హనుమంతునికి వెన్నను సమర్పించాలి. ముఖ్యంగా అమావాస్య రోజున హనుమ పూజ సకల భాగ్యాలను ఇస్తుంది. 
 
అలాగే రోజువారీగా "శ్రీరామజయం" అని పేపరుపై రాయవచ్చు. 48 రోజుల పాటు ఇలా చేస్తే శ్రీరాముడితో పాటు హనుమంతుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఎందుకంటే త్యాగరాజ స్వాములు 96 కోట్ల సార్లు రామ మంత్రాన్ని జపించి, శ్రీరామదర్శనం పొందారు.