గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (11:54 IST)

స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను: అందుకో నా ప్రేమలేఖ మహేష్ కత్తి

బిగ్ బాస్ షోతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శల ద్వారా పాపులర్ అయిన సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి తాజాగా కలర్ స్వాతికి ప్రేమలేఖ రాశాడు. కలర్ స్వాతికి మహేష్ కత్తి రాసే రెండో ప్రేమలేఖ ఇది. తాజాగ

బిగ్ బాస్ షోతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శల ద్వారా పాపులర్ అయిన సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి తాజాగా కలర్ స్వాతికి ప్రేమలేఖ రాశాడు. కలర్ స్వాతికి మహేష్ కత్తి రాసే రెండో ప్రేమలేఖ ఇది. తాజాగా స్వాతి నటించిన లండన్ బాబులు సినిమా చూసిన మహేష్ స్వాతి నటనకు ఫిదా అయిపోయాడట. అంతే లవ్ లెటర్ రాసేశాడు.. 
 
అందులో ఏముందంటే.. డియర్ స్వాతి.. ఇంతకుముందు తాను రాసిన ప్రేమ లేఖ ఇంకా తన మనస్సులో నిలిచి వుందన్నాడు. ''లండన్ బాబులు" చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, నవ్వుతోనూ నటించగల ప్రతిభను చూశాను. 
 
అప్పుడెప్పుడో సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను. అన్నీ భావాలను లండన్ బాబులో పండించిన స్వాతికి హ్యాట్సాఫ్.. అందుకే ఆగలేక. మనసు ఆపులేక రాసాను ఈ లేఖ.. అందుకో ఈ ప్రేమ లేఖ అంటూ స్వాతికి కత్తి మహేష్ లెటర్ రాశాడు. ఈ  లెటర్‌ను తన ఫేస్ బుక్‌లో మహేష్ కత్తి పోస్ట్ చేశాడు.