గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:34 IST)

యాక్సిడెంట్ అయిన క‌ళాకారిణి ఆదుకున్న `మనం సైతం`

Kadambari kiran help
చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో 24 క్రాఫ్ట్ ల‌లో పేద కార్మికుల‌కు ప‌లువురు ప‌లు ర‌కాలు ఆదుకుంటూనే వున్నారు. ముఖ్యంగా క‌రోనా ప‌స్ట్‌వేవ్ స‌మ‌యంలో సి.సి.సి. ద్వారా చిరంజీవి ఆధ్వ‌ర‌ర్యంలో నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేశారు. అందులో భాగంగా కాదంబ‌రి కిర‌ణ్ మ‌నం సైతం అనే ఫౌండేష‌న్ ద్వారా ఇతోదికంగా సాయం చేస్తూనే వున్నారు. ప్ర‌స్తుత‌తం ఆయ‌న చిత్ర‌పురి సొసైటీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వున్నారు. అలా వుంటూనే 24 శాఖ‌ల‌లో వున్న ఆపన్నుల‌కు ఆస‌రాగా నిలిచారు. తాజాగా ఆయ‌న మ‌రో మంచి కార్య‌క్ర‌మం చేశారు.
 
డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆరాధన పెండెం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆరాధన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మనం సైతం సంస్థ నుంచి 25 వేల రూపాయలను ఇవాళ ఆరాధన పెండెం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకున్న మనం సైతం కాదంబరి కిరణ్ గారికి ఆరాధన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
 
నిస్సహాయులను, పేదలను ఆదుకునేందుకు ఒక జీవనదిలా మనం సైతం సేవా కార్యక్రమం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా మనం సైతం ఫౌండర్ కాదంబరి కిరణ్ అన్నారు.