ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (13:47 IST)

జ‌ల‌క‌న్య‌లా కొచ్చి బీచ్‌లో సంద‌డి చేసిన‌ మంచు ల‌క్ష్మీ!

Manchu Lakshmi-, Kochi Beach
మంచు ల‌క్ష్మీ కొచ్చి బీచ్‌లో సంద‌డి చేసింది. షూటింగ్ గేప్‌లో ఇలా కూర్చుని ఎలా వున్నాను నేనంటూ పోస్ట్ చేసింది. ఇందుకు ఆమె ఫాలోవ‌ర్స్ భ‌లేగా స్పందించారు. బీచ్ దగ్గర బలే గా కనబడుతున్నావ్ డియర్‌. అదే జలకన్య లా ఉన్నావ్ , అలానే ఉంది చూడు , కానీ కాస్ట్యూమ్ యూ ఆర్ .. అంటూ స‌ర‌దాగా కామెంట్‌ను విన్నీరావ్ అనే ఫాలోవ‌ర్ పెట్టాడు. నేను అలా క‌నిపిస్తున్నానంటూ బ‌దులిచ్చిన ల‌క్ష్మీ మంచు అక్క‌డ ఎందుకున్నానేది తెలియ‌జేసింది.
 
ఈరోజు అంద‌మైన ఉద‌యం. బీచ్‌లో సూర్యోద‌యం త‌ర్వాత ఇలా కూర్చున్నా.  2022లో మొదటి వర్కింగ్ డే.  సినిమాకు చివరి షెడ్యూల్ కూడా. ఈ ఏడాది టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ షూటింగ్ గేప్‌లో పెట్టింది. మ‌రి షూటింగ్‌కు వెళ్ల‌నా.. అంటూ లేచి వెళ్ళిపోయింది.
 
తాజాగా మంచు ల‌క్ష్మీ  మాల‌యాళం `మాన్‌స్ట‌ర్‌` చిత్రంలో న‌టిస్తోంది. మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడు. దర్శకుడు: వైశాఖ్. ఈ చిత్రం షూట్ సంద‌ర్భంగా బీచ్ లో వుంది. 2009లో అన‌గ‌న‌గా ఒక ధీరుడు అనే సినిమాలో లేడీ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఆ త‌ర‌హాలోనే ఈమె పాత్ర వుంటుంద‌నే టాక్ వుంది. లక్ష్మీ బాంబ్,  గుండెల్లో గోదారి, దొంగాట వంటి చిత్రాల్లో న‌టించిన ల‌క్ష్మీ మంచుకు కొత్త చిత్రం ఎంత మేర ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.