మంచు మనోజ్ యూ టర్న్... మళ్లీ ఆ పని చేస్తున్నాడు...
మంచు వారబ్బాయి మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు చేయాలని తపిస్తుంటాడు. సినిమాలు చేస్తుంటాడు కానీ.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. ఇటీవల కాలంలో సరైన సక్సస్ రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల రాయలసీమ వస్తున్నాను కొంతకాలం రాయలసీమలోనే ఉంటాను అని ప్రకటించాడు. దీంతో మనోజ్ రాజకీయాల వైపు వెళ్తున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే అనుకున్నారు.
కానీ... సినిమాలకు గుడ్ బై చెప్పలేదు కొత్త సంవత్సరంలో సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 2019లో తన తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మార్చి 19న తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించేందుకు రెడీ అవుతున్నాడట మనోజ్. గతంలో చందు అనే కొత్త దర్శకుడితో మనోజ్ ఓ సినిమాకు రెడీ అవుతున్నట్టుగా టాక్ వచ్చింది. మరి.. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తాడా.? లేక మరో ప్రాజెక్ట్‌ను తెర మీదకు తీసుకువస్తాడా..? అనేది చూడాలి.