సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (10:23 IST)

నేడు మంచు మనోజ్ - భూమా మౌనికా రెడ్డి వివాహం

manoj mounika reddy
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిల వివాహం మార్చి మూడో తేదీ శుక్రవారం జరుగనుంది. దీంతో ఇరువురు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ పెళ్ళి వేడుకలో భాగంగా గురువారం మంచు వారి ఇంట్లో అట్టహాసంగా మెహందీ కార్యక్రమం జరిగింది. శుక్రవారం సంగీత కార్యక్రమం జరుగనుంది. ఇందులో అతికొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. 
 
దివంగత రాజీకీయ నేత అయిన భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోనున్నారు. నిజానికి వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇపుడు ఈ వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ ఒక్కటికానున్నారు. ఈ పెళ్లి వేడుకలు కూడా గణపతి, మహామంత్ర పూజతో ప్రారంభించారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్ళిని ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.
 
కాగా, మంచు మనోజ్ తన మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, మంచు విష్ణు భార్య వెరోనికాతో పాటు మంచు మనోజ్ మొదటి భార్య, ఇపుడు కాబోయే భార్య మౌనిక అంతా రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.