శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:42 IST)

మాది మాట‌ల పేన‌ల్ కాదు మానిఫెస్టో పేన‌ల్ - సీనియ‌ర్ న‌రేశ్‌

Naresh, vishnu pannel
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌, మంచు విష్ణు పేన‌ల్ పోటీ ప‌డుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ న‌రేశ్ బుధ‌వారం నాడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. గ‌త అధ్య‌క్షుని హోదాలో, ప్ర‌స్తుతం పోటీ చేస్తున్న మంచు విష్ణు పేన‌ల్‌కు అండ‌గా నిల‌స్తూ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప‌లు అంశాల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. ఎక్కువ‌గా ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌ముందు ప‌లు ప్ర‌శ్న‌లు వుంచారు. మాది మాట‌ల పాన‌ల్ కాదు. మేనిఫెస్టో పేన‌ల్ అంటూ వివ‌రించారు. `మా` ఎన్నిక‌లు ఫ్రెండ్లీ కానీ ఓటు అనేది ఫ్రెండ్లీకాదు అని తేల్చి చెప్పారు.
 
స‌రైన‌వాడు లేక‌నే మీరు వ‌చ్చారా!
 
ప్ర‌కాష్‌రాజ్ నుద్దేశించి ప్ర‌సంగం అంతా జ‌రిగింది. ఇటీవ‌ల ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడిన మాట‌లు న‌న్ను బాధించాయి. తెలుగువారినెవ‌రినైనా భాధిస్తాయి. తెలుగు సంఘంలో స‌రైన‌వాడు లేక‌పోవ‌డంతో నేను పోటీకి వ‌చ్చాన‌ని ప్ర‌కాష్‌రాజ్ అన‌డంలో అర్థం ఏమిటి? కోటి ర‌తనాల సీమ రాయ‌ల‌సీమ‌, కోటి ర‌త్నాల వీణ తెలంగాణ‌, అంద‌రిభందువు అయిన ఆంద్ర‌లో ఎవ‌రూ లేరనే మీ ఉద్దేశ్య‌మా? ఎన్‌.టి.ఆర్‌. ర‌క్తం మాలో లేదా? 
కాపు సంఘం ర‌ఘుప‌తి వెంక‌య్య‌నాయుడు ర‌క్తం మాలే లోదా?  టంగుటూరి ప్ర‌కాశం పంతులు ర‌క్తం లేదా? అల్లూరి సీతారామ‌రాజు ర‌క్తం మాలో లేదా?  నేను ఇండ‌స్ట్రీలో ప‌నిచేస్తాను అనండి. కానీ ఇక్క‌డ స‌రైన‌వాళ్ళు లేర‌ని అన‌కండి. రేపు గెలిస్తే స‌రైన‌వాడులేక‌నే న‌న్ను గెలిపించారు అని అనరా మీరు? అంటూ ప్ర‌శ్నించారు.
 
పాలించేది స్థానియ‌కులే
న‌టుడిగా ఎవ‌రికైనా ఏ భాష‌లోనైనా న‌టించ‌వ‌చ్చు. కానీ పాలించేది స్థానికులే. ధ‌క్షిణాది ఇత‌ర భాష‌ల్లో నేను కూడా స‌భ్య‌డినే. నేను అక్క‌డ పోటీచేసి పాలిస్తానంటే కుద‌ర‌దు. మీరు ఎందుకు అక్క‌డ నిల‌బ‌డి గెల‌వ‌లేదు. మీరు తెలంగాణాలో ఓ గ్రామాన్ని  ద‌త్త‌త చేసుకున్నారు. కానీ నేను కొన్ని గ్రామాల‌నే  ద‌త్త‌త తీసుకున్నాను. 11వేల మంది రిజిష్ట‌ర్ క‌ళాకారుల‌కు గుర్తింపు కార్డులు ప్ర‌భుత్వ త‌ర‌ఫున ఇచ్చాను. కొంత‌మంది పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నాను. `మా`లో అధ్య‌క్షుడి అయ్యాక పేద క‌ళాకారుల‌కోసం ఫించ‌న్లు, ప్ర‌భుత్వం ప‌రంగా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, ఇండ్ల స్థ‌లాల కోసం వెళ్ళి ముఖ్య‌మంత్రితో మాట్లాడాను. మ‌రి ఆ ప‌ని చేశారా? అస‌లు మీకు ఈ విష‌యాలు తెలుసా? మ‌రి క‌ళాకారుల పిల్ల‌ల్ని ఎందుకు ద‌త్త‌త చేసుకోలేదు. ఉన్న‌ట్టుండి `మా`పై ఎందుకు మీకు ప్రేమ క‌లిగింది. మీరే వ‌చ్చారా? ఎవ‌రైనా తీసుకు వ‌చ్చారా? అంటూ ప్ర‌శ్నించారు. 
 
అందుకే స‌భ్యులైనా ఓట‌ర్ల‌లారా మీకు నేను చేసే విన్న‌పం ఒక్క‌టే. ఏదోఒక పేన‌ల్‌ను గెలిపించండి. అదికూడా క‌ళాకారుల‌కు సేవ‌చేసేది అయివుండాలి. అధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి, కోశాధికారి ఈ మూడు పోస్టులు స‌రైన‌వారిని గెలిపిస్తేనే అసోసియేష‌న్ ముందుకు వెళుతుంది. ఇక్క‌డ ఓ విష‌యం ప్ర‌కాష్‌రాజ్‌ను అడుగ‌తున్నాను.
 
మీరు ఎన్నిసార్లు మా ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. ఎన్నిసార్లు జ‌న‌ర‌ల్ బాడీకి హాజ‌ర‌య్యారు. మిమ్మ‌ల్ని ఎందుకు స‌స్పెండ్ చేశారో మీకు గుర్తుందా? అంటూ మీడియా ముందు వేలెత్తి చూపారు.