శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (10:43 IST)

దేహదానం చేస్తామని.. ప్రకటించిన మణిరత్నం దంపతులు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరి వేడుకల్లో మణిరత్నం దంపతులు మాట్లాడుతూ.. దేహదానం గురించి వివరించారు. 
 
మృతిచెందిన తరువాత పలువురికి పునరుజ్జీవనం కలిగించేందుకు చేస్తున్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా దర్శకుడు మణిరత్నం, ఆయన సతీ మణి, నటి సుహాసిని, చారుహాసన్‌ ఆయన సతీమణి కోమల చారు హాసన్‌ తమ దేహాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బృహ త్‌కార్యం కోసం అందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.