గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (15:27 IST)

మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఇకలేరు...

చిత్రపరిశ్రమలో వరుస విషాద సంఘటనలు జరుగుతున్నాయి. ఒక‌రి మ‌ర‌ణ వార్త‌ని మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు క‌న్నుమూస్తున్నారు. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఆదివారం ఉదయం కన్నుమూశారు. 
 
83 ఏళ్ళ వయసులో ఉన్న రాధాకాంత్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గుర‌య్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న రాధాకాంత్‌ని ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 
 
తండ్రిని పోగొట్టుకున్న మ‌నోజ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. రాధాకాంత్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతున్నారు. మ‌నోజ్ బాజ్ పాయ్ కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇది ఎంత‌గానో అలరించ‌డంతో పాటు ఆయ‌నకు అవార్డ్ ద‌క్క‌లా కూడా చేసింది.