శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (07:03 IST)

రాముడిపై చాలా సినిమాలు వచ్చాయి. ఈ తరానికి కావాలి అదే ఆదిపురుష్ : జీయర్ స్వామి

Jeeyar Swami, prabhas
Jeeyar Swami, prabhas
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ప్రభాస్, కృతి సనన్ మరియు సైఫ్ అలీఖాన్ ప్రదాన పాత్రధారులుగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో నిన్న రాత్రి ప్రీరిలీజ్ వేడుక జరిగింది. జీయర్ స్వామి ముఖ్య అతిధి. టిటిడి. సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. 
 
తన స్పీచ్ ని శ్రీరామ పద్యంతో మొదలుపెట్టిన చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ…"జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్…డియర్ భగవత్ బంధువులారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం ఏమిటి అంటే.. బాహుబలి .. నిజమైన బాహుబలి రాముడు అని లోకానికి రుజువుపించడానికి వచ్చింది. ఈ వేళ ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు..ప్రతి గుండెలోన రాముడు ఉన్నారు ఆ గుండెల్లో ఉండే రామున్ని అందరిలోంచి బయటకు తీసుకురావడానికి శ్రీమాన్ ప్రభాస్ తనలోంచి రాముడిని బయటకు తీసుకొస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మానవజాతికి సరైన దారి చూపియాల్సింది శ్రీరామచంద్రుడే రామచంద్రుని గురించి రకరకాలుగా మాటలు ఏమి చెప్పినా రాముడు ఈ మట్టి మీద నడిచి  పవనం చేసినటువంటి మహా పురుషుడు. మానవజాతికి ఆదర్శవంతమైన పురుషుడు ఆయన.

చాలామంది రాముడిని దేవుడిగా కొలిచే వాళ్ళు ఉన్నారు. కొలవచ్చు.. కానీ రామాయణంలో దేవతలంతా వచ్చి రామ నువ్వు సాక్షాత్తు నారాయణవయ్యా.. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ అయ్యా అని చెబితే .. రాముడు మాత్రం నేను మానవుడిని నన్ను మనిషిలాగే చూడాలి అని అనుకుంటున్న ఎందుకని అంటే రాముల దేవుడు అని అనగానే ఆ దేవుడికి ఏమి లేంది ఏమైనా చేస్తారు అని మానవులు తప్పించుకునే ప్రమాదం ఉంది. ఒక మనిషి ఒక మార్గాన్ని నడిచి ఆదర్శాన్ని స్థాపించారు అంటే ఏ మనిషి అయినా సరే అలా ప్రవర్తించే తగును అని నిరూపించడానికి రాముడు మానవుడు అయ్యారు. రామాయణంలో రామచంద్రుడు మంచి మనిషి ఆయన పుట్టకముందే విష్ణువు అవతారం.  సాధించిన తర్వాత విష్ణువు. కానీ జీవన సమయంలో తాను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనము దేవతల వెంట పరుగులు పెట్టే అవసరం లేదు. దేవతలు మంచి మనిషి వెనక నడుస్తాడు ఆ మంచి మనిషిని ఈ సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది. ఇది రామాయణం జాతికి నిరూపించింది కానీ మంచి మనిషి ఎట్లా ఉంటారు .. రాముడు అంటే మంచికి మారుపేరు అని మనిషి మనిషిగా ఉంటే అతనికి శత్రువులే ఉండరు అని రాముడు రుజువు చేశారు. రాముని ని మనుషులు ప్రేమించారు.. ఋషులు ప్రేమించారు.. దేవతలు ప్రేమించారు ..పశువులు ప్రేమించాయి పక్షులు ప్రేమించాయి.. ముక్కు చెవులు పోసిన సూర్పనకు కూడా రామచంద్రుని గురించి తిట్టాలని నోరు తెరిచి ఆఖరికి ఆయన కీర్తించింది. 

రాముడు అడవికి వెళుతూ ఉంటే  రాముడిని చూస్తూ ఉండిపోయాయి గుర్రాల కూడా. ఆ గుర్రాలని ఆ ప్రదేశం యొక్క మంచి బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. రాముడిని ఇలా పశువులు చెట్లు అన్ని ప్రేమించాయి. అందుకే ఈవేళ ఆయన్ని గుడులు కట్టి ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆ రాముడు మన అందరిలో ఉన్నారు కానీ ఎవరైనా మనలోంచి ఆ రాముడుని బయటకి తెచ్చేవాళ్ళు కావాలి. ఆ రాముని తమలో ఉండేటువంటి రాముడిని బయటకు తెస్తున్నారు హీరో ప్రభాస్. రామాయణంలో అరణ్యకాండ మరియు యుద్ధ కాండలో ఉండే ప్రధానమైనటువంటి వాటిని చరిత్రతో లోకానికి అందజేస్తున్నారు ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరేడి ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నారు. అలానే ఇలాంటి సినిమా ఇస్తున్న ఓం రౌత్ కి మా ధన్యవాదాలు".
 
ఆదిపురుష్‌తో చరిత్ర సృష్టించినందుకు ఓం రౌత్ బృందానికి ఆశీస్సులు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. మనం మొబైల్ దేవాలయాలు. ఒక్కోసారి దేవుడు మన నుండి బయటకు వస్తాడు. రాముడు ప్రభాస్ నుండి వస్తున్నాడు... టీమ్ మొత్తానికి రాముడు ఆశీర్వదించాడు. ఇక్కడే రామాయణ చరిత్ర వెల్లడైంది. రాముడు మనందరికీ నిజమైన ఆదర్శం. రాముడిపై చాలా సినిమాలు వచ్చాయి. ఈ తరానికి మరొకటి కావాలి మరియు అదే ఆదిపురుష్ మరియు అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది.