బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (11:51 IST)

#MCATeaser నాని, సాయిపల్లవి ఎంసీఏ ట్రైలర్ (Video)

నేచురల్ స్టార్ నాని తాజా సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వరుస విజయాలతో సక్సెస్ హీరోగా పేరు కొట్టేసిన నాని.. ఎంసీఏతో మిడిల్ క్లాస్ అబ్బాయిగా ట్రైలర్లో అదరగొట్టేశాడు

నేచురల్ స్టార్ నాని తాజా సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వరుస విజయాలతో సక్సెస్ హీరోగా పేరు కొట్టేసిన నాని.. ఎంసీఏతో మిడిల్ క్లాస్ అబ్బాయిగా ట్రైలర్లో అదరగొట్టేశాడు. నాని కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఫిదా తర్వాత నానితో జతకట్టిన సాయిపల్లవి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. నాని, సాయిపల్లవి డైలాగ్స్‌తో కూడిన సీన్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. నటన విషయంలో నాని, సాయిపల్లవి పోటీపడ్డారని.. టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. యూత్‌ను .. ఫ్యామిలీ ఆడియన్స్‌‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. 'ఫిదా' హిట్ తో వున్న సాయిపల్లవి, 'నిన్నుకోరి' తో సక్సెస్‌ను అందుకున్న నాని, ఈ సినిమాతో కలిసి మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారో లేదో వేచి చూడాలి.