ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (12:02 IST)

"మిడిల్ క్లాస్ అబ్బాయి"గా హీరో నాని అదరగొట్టేశాడు...

తెలుగు చిత్రపరిశ్రమలో వరుసహిట్లతో దూసుకెళుతున్న యువ హీరోల్లో నాని మొదటి వరుసలో ఉన్నాడు. నాని నటిస్తున్న ప్రతి చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈనేపథ్యంలో మరోమారు ప్రేక్షకులను ఆలరించడానిక

తెలుగు చిత్రపరిశ్రమలో వరుసహిట్లతో దూసుకెళుతున్న యువ హీరోల్లో నాని మొదటి వరుసలో ఉన్నాడు. నాని నటిస్తున్న ప్రతి చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈనేపథ్యంలో మరోమారు ప్రేక్షకులను ఆలరించడానికి 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)గా రానున్నాడు.
 
వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఎంసీఏ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుండ‌గా, దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. లుంగీలో మ‌న నేచుర‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. చేతిలో పాల పాకెట్ ప‌ట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో 'ఎంసీఏ అలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' పోస్టర్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావ‌డంతో ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ చిత్రం తర్వాత నాని "కృష్ణార్జున యుద్ధం" పేరుతో మరోమారు ఆలరించనున్నాడు.