సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (15:05 IST)

షోయబ్ మాలిక్ భార్య సనా జావేద్ ఎవరో తెలుసా?

Sana Javed
Sana Javed
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌తో తన మూడో పెళ్లిని ప్రకటించాడు. షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న నటి సనా జావేద్‌ ఎవరో తెలుసా? సనా జావేద్ ఎవరు? సనా జావేద్ పాకిస్థానీ నటి, ఆమె 2012లో షెహర్-ఎ-జాత్‌తో రంగప్రవేశం చేసింది. 
 
అయితే, రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్ పోషించిన తర్వాత ఆమెకు గుర్తింపు వచ్చింది.  సనా జావేద్ లక్స్ స్టైల్ అవార్డ్స్‌లో నామినేషన్ కూడా అందుకుంది. ఖానీతో పాటు, సనా రుస్వాయి, డంక్ వంటి నాటకాలకు కూడా ప్రసిద్ది చెందింది.
 
సనా జావేద్ గతంలో పాకిస్థానీ నటుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీత నిర్మాత ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. వారు అక్టోబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు కానీ 2023 చివరిలో విడిపోయారు. 
Sana Javed
Sana Javed
 
సనా - ఉమైర్ తమ జంట చిత్రాలన్నింటినీ సోషల్ మీడియా నుండి తొలగించారని నెటిజన్లు గమనించిన తర్వాత వారి విడిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. షోయబ్ మాలిక్ - సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.